ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే కేసీఆర్‌కు ఎంత తాగినా మత్తు ఎక్కట్లే

by Ramesh Goud |   ( Updated:2021-10-21 04:47:01.0  )
ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే కేసీఆర్‌కు ఎంత తాగినా మత్తు ఎక్కట్లే
X

దిశ‌, క‌మ‌లాపూర్ : అయ్యా కొడుకులు మ‌త్తులో మునుగుతున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల‌పై ఎంపీ అరవింద్ సంచ‌న‌ల వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేంద‌ర్‌తో గెలుక్కున్నప్పటి నుంచి కేసీఆర్‌కు ఎంత తాగినా మ‌న‌సు నిమ్మల‌మైత‌లేదు, మ‌త్తు ఎక్కడం లేదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ వ్యవ‌స్థాపితం నుంచి పునాదుల నుంచి ప‌ని చేస్తున్న ఈట‌ల‌రాజేంద‌ర్‌ను వెళ్లగొట్టడం అన్యాయ‌మ‌ని అన్నారు. ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడ‌గొట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ‌త‌విధాలా ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ని, కానీ ఆయ‌న ప‌నంతా ఉత్తదేన‌ని తేలిపోతోంద‌ని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం క‌మ‌లాపూర్ మండ‌లం మ‌ర్రిప‌ల్లి గూడెంలో అభ్యర్థి ఈటల రాజేంద‌ర్‌తో క‌ల‌సి ఎంపీ అర‌వింద్ ప్రచారం నిర్వహించారు. ఆయ‌న‌తో పాటు వ‌రంగ‌ల్ బీజేపీ అధ్యక్షురాలు రావు ప‌ద్మ, సీనియ‌ర్ లీడ‌ర్, మాజీ ఎమ్మెల్యే విజ‌య‌రామ‌రావు త‌దిత‌రులున్నారు.

ఈసంద‌ర్భంగా ఎంపీ అర‌వింద్ మాట్లాడుతూ ఓట‌మి ఎర‌గ‌ని నాయ‌కుడు ఎదుగుతున్నాడ‌నే ఈట‌ల రాజేంద‌ర్‌ను కేసీఆర్ దెబ్బ కొట్టాల‌ని చూశాడ‌ని అన్నారు. ప్రజ‌లు కేసీఆర్‌ను దించేస్తే ఈట‌ల రాజేంద‌ర్ ముఖ్యమంత్రి క్యాండెంట్ అంటూ త‌న‌కు ఓ సీనియ‌ర్ రాజ‌కీయ నేత చెప్పినట్లు తెలిపారు. ఈ రాష్ట్రాన్ని ఓ తాగుబోతు, చాత‌గాని కొడుకు న‌డుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ద‌ళిత బంధుతో ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు ప్రయ‌త్నం చేస్తున్నార‌ని అన్నారు. అయితే ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమలు చేయ‌డానికి క‌నీసం ఖ‌జ‌నాలో పైస‌ల్లేవ‌ని ప్రభుత్వంలో కీల‌కంగా ప‌నిచేస్తున్న ఓ అధికారే త‌న‌కు స్వయంగా చెప్పినట్లు పేర్కొన్నారు. ద‌ళిత‌బంధు అమలు చేయ‌డానికి ఒక్క హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గమే లేద‌ని, రాష్ట్రమంతా ఎందుకు అమ‌లు చేయ‌ర‌ని ప్రశ్నించారు.

Advertisement

Next Story