యస్‌. గోపాల్‌ రెడ్డి విడుదల చేసిన ‘అరంగేట్రం’ ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌

by sudharani |   ( Updated:2023-04-24 12:40:37.0  )
యస్‌. గోపాల్‌ రెడ్డి విడుదల చేసిన ‘అరంగేట్రం’ ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌
X

దిశ, సినిమా : మహీ మీడియా వర్క్స్‌ బ్యానర్‌లో కే. మహేశ్వరి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘అరంగేట్రం’. శ్రీనివాస్‌ ప్రభన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్ చేసిన సినిమాటోగ్రాఫర్‌ యస్‌. గోపాల్‌ రెడ్డి చిత్ర యూనిట్‌‌కు అల్‌ ది బెస్ట్‌ చెబుతూ సినిమా పెద్ద హిట్‌ కావాలని ఆశీర్వదించారు.

నాట్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆరుగురు కొత్త అమ్మాయిలు పూజ, లయ, కీర్తన, ఇందు, సాయిశ్రీ, విజయ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండగా.. శ్రీవల్లి, రోషన్‌, శ్రీనివాస్‌ ప్రభన్‌, ముస్తఫా, అనిరుధ్‌, జబర్దస్త్‌ ఫేం సత్తిపండు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌‌కు ఆడియన్స్‌ నుంచి భారీ ఆదరణ లభిస్తుండగా చిత్ర యూనిట్ ఖుషీగా ఉన్నారు. గడియన్‌ కట్టా సంగీతం అందించారు.

Also Read..

సాయిపల్లవి లిప్ కిస్ ఇచ్చిన ఏకైక హీరో ఎవరంటే?



Next Story

Most Viewed