- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ హిట్ డైరెక్టర్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఫిక్స్.. వైరల్ అవుతున్న న్యూస్

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా కొరటాల శివ(Koratala Shiva) డైరెక్షన్‌లో ‘దేవర’(Devara) మూవీలో నటించాడు. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా స్టోరీ పరంగా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌గా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇందులో అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor) హీరోయిన్‌గా నటించి.. ఈ మూవీతోనే ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే జాన్వీ ఈ సినిమాలో తన గ్లామర్‌తో కుర్రాళ్ల మనసు గెలిచిందనే చెప్పాలి.
ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సరసన ‘Rc-16’ మూవీలో నటిస్తోంది. దీనికి ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీ బిజీగా ఉన్నాడు. అందులో బాలీవుడ్ డెబ్యూ సినిమా అయినటువంటి ‘వార్-2’ (War-2) ఒకటి.
ఇప్పటికే ఆయన షూటింగ్ కంప్లీట్ చేసినట్లు సమాచారం. అయితే ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ కానుంది. అలాగే స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో కూడా ఓ మూవీ చేయబోతున్నాడు. అయితే ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇతనికి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఎన్టీఆర్ తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar)తో మరో సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. నెల్సన్ చెప్పిన కథ మన యంగ్ టైగర్‌రకి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక అన్ని ప్లాన్ ప్రకారం జరిగితే ఈ సినిమా 2026 లో సెట్స్ మీదకు వెళ్లనుందట. ఇక అత్యంత భారీ బడ్జెట్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) నిర్మించనున్నారట. కాగా ప్రస్తుతం నెల్సన్ సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajini Kanth) ‘జైలర్-2’(Jailer-2)ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి ‘జైలర్’(Jailer) మూవీకి సీక్వెల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్‌గా ‘జైలర్-2’ నుంచి వచ్చిన ప్రోమో సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.