Meena: ఆ రాజకీయ నాయకుడిని మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందా..?

by Prasanna |
Meena: ఆ రాజకీయ నాయకుడిని  మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందా..?
X

దిశ, సినిమా: సీనియర్ నటి మీనా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనా.. ఆ తర్వాత తన అందం, అభినయంతో మెప్పించింది. ఎంతో మంది స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. ఇక కెరీర్ విషయం పక్కనపెడితే గత ఏడాది మీనా తన భర్తను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక భర్త చనిపోయిన రెండు మూడు నెలలకే తన కూతురు కోసం రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా ఈ విషయంపై మరోసారి స్పందించింది. ‘నేను హీరోయిన్ గా చేసిన సమయంలో గ్లామర్ రోల్స్ హద్దు మీరేవి కావు. కానీ ఇప్పుడు చాలా హద్దులు మీరుతున్నాయి. నా భర్త చనిపోయాక చాలామంది నాపై ఎన్నో రకాల వార్తలు రాసుకోస్తున్నారు. నేను ధనుష్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నానని, అలాగే ఓ రాజకీయ నాయకుడితో మ్యారేజ్ అని, బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంటున్నానని.. ఇలా ఎవరు పడితే వారితో పెళ్లి అని నా గురించి వార్తలు రాసేస్తున్నారు. నేను ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఇదే కొనసాగుతుంది. అంతేకాదు నా భర్త చనిపోయే ముందు నాకు ఆయనతో గొడవలు అయ్యాయని కూడా ప్రచారం చేశారు. కానీ ఇందులో ఏ ఒక్కటీ నిజం కాదు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవాళ్ళు ఒకసారి మా ఫ్యామిలీ గురించి ఆలోచించాలి’ అని కోరింది.

Advertisement

Next Story

Most Viewed