- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘విజయదశమికి ఆయుధపూజ’.. ‘#NBK108’ నుంచి బిగ్ అప్‌డేట్

X
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘#NBK108’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఇటీవలే ఉగాది సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా ఈ చిత్రాన్ని 2023 దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ‘విజయదశమికి ఆయుధ పూజ’ అనే పేరుతో అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. బాలకృష్ణ చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇందులో కాళీ మాత విగ్రహం కూడా కనిపిస్తుండగా.. కాజల్ అగర్వాల్, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి: బాలయ్య ‘NBK108’ నుంచి అదిరిపోయే అప్డేట్
Next Story