బాలీవుడ్ భామ నోరా ఫతేహితో వరుణ్ తేజ్ రొమాన్స్.. అంతా మట్కా మహిమ!

by sudharani |   ( Updated:2023-07-27 09:39:16.0  )
బాలీవుడ్ భామ నోరా ఫతేహితో వరుణ్ తేజ్ రొమాన్స్.. అంతా మట్కా మహిమ!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్‌తో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరుస వెకేషన్లు ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట.. అటూ సినిమాల పరంగా కూడా బిజీగా ఉంటున్నారు. లావణ్య త్రిపాఠి రెండు మూడు సినిమాలకు సైన్ చేసి షూటింగ్‌ల్లో బిజీ కాగా, వరుణ్ సైతం కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ తాజాగా తన 14వ సినిమానూ ప్రకటించారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

వైరా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘మట్కా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పలాస దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించబోతున్నట్లు టాక్. కాగా.. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

Lavanya Tripathi : జిమ్‌లో చెమటలు చిందిస్తున్న మెగా కోడలు.. హాట్ లుక్ ఫొటోలు వైరల్

సెక్సీ లుక్స్ తో వరుణ్ ను టెంప్ట్ చేస్తున్న సొట్టబుగ్గల చిన్నది

Advertisement

Next Story