‘Palasa’ డైరెక్టర్‌తో Varun Tej మూవీ.. పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయిందట!

by Prasanna |   ( Updated:2023-07-23 10:33:37.0  )
‘Palasa’ డైరెక్టర్‌తో Varun Tej మూవీ.. పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయిందట!
X

దిశ, సినిమా : టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అభిమానులకు త్వరలోనే అదిరిపోయే అప్‌డేట్ రాబోతుంది. మొదటినుంచి భిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న వరుణ్.. తన 14వ చిత్రాన్ని పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వరుణ్ తేజ్‌ను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి కరుణ కుమార్ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం. కాగా జూలై 27న హైదరాబాద్‌లోనే ఈ నయా ప్రాజెక్ట్ గ్రాండ్‌గా లాంచ్ కాబోతుందని, దీనికోసం వరుణ్ తేజ్ పూర్తిగా డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డా.విజేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారని, ఈ వారంలోనే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

Also Read: డైరెక్టర్ Anil Ravipudi పీక మీద కత్తి పెట్టి బెదిరించిన Brahmaji.. వీడియో వైరల్

Advertisement

Next Story