- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి విషయంలో పవన్ కల్యాణ్‌ను ఫాలో అవుతున్న వరుణ్ తేజ్.. ఇది రెండోది?
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, త్వరలో వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుని మెగా కోడలిగా అడుగుపెట్టబోతుంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి జూన్ 9న సినీ ప్రముఖుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వరుణ్‌తేజ్ సినిమాలు, స్టైల్లోనే కాకుండా నిజజీవితంలో పవన్ కల్యాణ్‌ను ఫాలో అవుతున్నట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో ఎవరు హీరోయిన్స్‌ను వివాహమాడలేదు. చిరు భార్య సురేఖ, నాగబాబు భార్య పద్మ, అల్లు అరవింద్ భార్య గీత.. అల్లు అర్జున్ భార్య స్నేహ.. రామ్ చరణ్ భార్య ఉపాసన.. ఇలా అందరూ బిజినెస్, మరో రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకున్నారు.
అయితే పవన్ కల్యాణ్ మాత్రం బద్రి సినిమా సమయంలో హీరోయిన్ రేణు దేశాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్, యంగ్ హీరోయిన్ లావణ్యను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వారిలో మెగా ఇంట రేణు దేశాయ్ తర్వాత లావణ్య రెండో సెలబ్రిటీగా అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వరుణ్ అన్ని విషయాల్లో బాబాయ్‌ని ఫాలో అవుతున్నాడని అనుకుంటున్నారు ఫ్యాన్స్. వరుణ్, లావణ్య పెళ్లి త్వరలో గ్రాండ్‌గా జరగనున్నట్లు సమాచారం.
Also Read: ఏ సినిమా టైంలో లావణ్య, వరుణ్‌ల ప్రేమ మొదలైందో తెలుసా?