చెప్పలేరు.. ఊహించలేరు.. ‘నింద’ ప్రమోషన్స్‌లో వరుణ్ సందేశ్

by sudharani |
చెప్పలేరు.. ఊహించలేరు..  ‘నింద’ ప్రమోషన్స్‌లో వరుణ్ సందేశ్
X

దిశ, సినిమా: హీరో వరుణ్ సందేశ్ ‘మంచి రోజులు’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ‘కొత్త బంగారు లోకం’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వరుణ్.. ‘నింద’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందకు సిద్ధం అవుతున్నాడు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేశ్ జగన్నాధం నర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ మూవీ జూన్ 21 న రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్ర బృందం. ఈ సందర్బంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘రొటీన్ సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్‌గా అనిపించింది. అందుకే కాస్త గ్యాప్ తీసుకుని.. ఈ మూవీతో వస్తున్నా. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లలో ఎన్నో మూవీస్ వచ్చాయి. నింద కూడా అలాంటి సినిమానే. కానీ ఈ సినిమా మాత్రం స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. ఊహించలేరు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed