ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్యపై Upasana Konidela ఎమోషనల్ పోస్ట్..

by Manoj |   ( Updated:2022-06-12 07:00:21.0  )
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్యపై Upasana Konidela ఎమోషనల్ పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల మృతిపై రామ్ చరణ్ భార్య ఉసాసన ఎమోషనల్ పోస్ట్ చేశారు. ట్విట్టర్ ద్వారా ఇలా రాశారు 'మై బెస్టీ, మై డియరెస్ట్‌ ఫ్రెండ్‌ చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తన మరణం నన్ను చాలా బాధిస్తోంది. ప్రతి విషయంలో ఎంతో ది బెస్ట్‌గా ఉండేది. ఇక కెరీర్‌, ఫ్యామిలీ, స్నేహితుల విషయంలోనూ ఉన్నత నిర్ణయాలు తీసుకునేది. అలా అన్ని విషయాల్లో ది బెస్ట్‌గా ఉండే ఆమె కూడా డిప్రెషన్‌కు గురైంది. ఈ సంఘటన తర్వాత కర్మ అనేది మన జీవితకాలం గుండా పయనిస్తుందనేది నిజమనిపిస్తుంది. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా'అని ఉపాసన భావోద్వేగానికి గురైంది.

Advertisement

Next Story

Most Viewed