మెగా కోడలు ఉపాసన డెలివరీకి ముహూర్తం ఖరారు..

by sudharani |   ( Updated:2023-06-20 08:44:35.0  )
మెగా కోడలు ఉపాసన డెలివరీకి ముహూర్తం ఖరారు..
X

దిశ, వెబ్‌డెస్క: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మెగా వారసత్వం రాక కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తాజాగా ఉపాసన డిలవరీకి ముహుర్తం కూడా ఖారారు అయింది. రేపు ఉదయం 6:30 నిమిషాలకు డెలివరీ చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఉపాసన, రామ్ చరణ్ ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు.

కాగా, పెళ్లైన 10 ఏళ్లకి తల్లితండ్రులు కాబోతున్న చరణ్-ఉపాసన బేబీ కోసం ఫుల్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. చరణ్ ప్రజెంట్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మ్యాగ్జిమమ్ షూట్ కంప్లీట్ చేసిన టీమ్ క్లైమాక్స్ షూట్ పనిలో ఉంది. క్లైమాక్స్‌తో పాటు చరణ్‌కి సంబంధించి కొన్ని సీన్స్ చెయ్యాల్సి ఉంది. ఆల్రెడీ నెలరోజుల నుంచి షూట్ వాయిదా పడి ఉంది. ప్రస్తుతం ఉపాసనతోనే ఉన్న చరణ్ డెలివరీ అయ్యే వరకూ షూటింగ్‌కి అటెండ్ కానని క్లియర్‌గా చెప్పేశారని సమాచారం. ఇటీవల చరణ్, ఉపాసన శర్వానంద్ పెళ్లిలో, వరుణ్ తేజ్ నిశ్చితార్థంలో సందడి చేశారు.

ఇవి కూడా చదవండి :: ఈ సంగీతం వింటూ బిడ్డకు జన్మనివ్వనున్న ఉపాసన.. కంపోజ్ చేసింది మరెవరో కాదు..

Advertisement

Next Story