స్టార్‌డమ్ రావడంతో బాయ్ ఫ్రెండ్‌ను మార్చేసిన యానిమల్ బ్యూటీ

by sudharani |   ( Updated:2023-12-19 13:23:17.0  )
స్టార్‌డమ్ రావడంతో బాయ్ ఫ్రెండ్‌ను మార్చేసిన యానిమల్ బ్యూటీ
X

దిశ, సినిమా : ‘యానిమల్’ సినిమాలో 15 నిమిషాల పాత్రలో కనిపించిన బ్యూటిఫుల్ త్రిప్తి దిమ్రీ నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఇన్‌స్టాలోనూ భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే ఈ భామ హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడు కర్ణేష్ శర్మతో డేటింగ్‌లో ఉందని ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరు విడిపోయారని.. ప్రస్తుతం మోడల్ అండ్ బిజినెస్‌మ్యాన్ సామ్ మర్చెంట్‌తో ప్రేమాయణం నడుపుతోందని తెలుస్తోంది.

ఈ మధ్య ఓ వెడ్డింగ్ ఈవెంట్‌కు హాజరైన బ్యూటీ.. ఆయనతో కలిసి క్లోజ్‌గా ఫొటోలు దిగడంతో ఈ రూమర్ మొదలైంది. సామ్ మర్చెంట్ గోవాలోని వాటర్స్ బీచ్ లాంజ్ అండ్ గ్రిల్ ఫౌండర్‌. కాగా సోషల్ మీడియాలో దిశా పఠానీ, టైగర్ ష్రాఫ్ లాంటి సెలబ్రిటీస్ ఆయన ఫాలోవర్స్‌గా ఉన్నారు. 2002 గ్లాడ్‌రాగ్స్ మ్యాన్‌హంట్ కాంటెస్ట్ విన్నర్‌గా నిలిచిన సామ్.. తర్వాత వ్యాపార రంగంలోకి మారినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story