రణ్‌బీర్‌తో మితిమీరిపోయిన రొమాంటిక్ సీన్స్.. ముందుగా చాలా డిస్టర్బ్ అయ్యా.. ముగ్గురు నలుగురితో..

by sudharani |
రణ్‌బీర్‌తో మితిమీరిపోయిన రొమాంటిక్ సీన్స్.. ముందుగా చాలా డిస్టర్బ్ అయ్యా.. ముగ్గురు నలుగురితో..
X

దిశ, సినిమా : ‘యానిమల్’ సినిమాతో రణ్‌బీర్ కపూర్, రష్మిక, బాబీ డియోల్‌కు ఎంత అప్లాజ్ అందిందో.. క్యారెక్టర్ చిన్నదైనా అంతకు మించిన గుర్తింపు యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీకి వచ్చింది. కేవలం 15 నిమిషాల పాత్రలో కనిపించిన ఈ గ్లామర్ డాల్‌ యూత్‌కు కనెక్ట్ అయిపోయింది. అయితే మరోవైపు రణ్‌బీర్‌తో శృంగార సన్నివేశాలు మితిమీరిపోయాయనే విమర్శలు కూడా అందుకుంది. ఈ విషయంపై తాజాగా స్పందించిన త్రిప్తి.. కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన ‘బుల్‌బుల్‌’లోని రేప్ సీన్స్‌ తనను పర్సనల్‌గా సవాల్‌ ఎదుర్కొనేలా చేశాయని, మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యానని చెప్పింది. ఆ సన్నివేశాలతో పోలిస్తే రణ్‌బీర్‌తో రొమాంటిక్ సీన్స్‌లో అంతగా ఇబ్బంది అనిపించలేదని తెలిపింది. సెట్‌లో ముగ్గురు నలుగురు మాత్రమే ఉండేవారని దీంతో పెద్దగా పర్సనల్‌గా ఎఫెక్ట్ కాలేదని వివరించింది. ముఖ్యంగా ‘బుల్‌బుల్’లో సీన్ చేయాలంటే ధైర్యాన్ని కూడగట్టుకోవడం కన్నా ఆ సన్నివేశాలకు లొంగిపోవడం చాలా కష్టమన్న బ్యూటీ.. వాటితో పోలిస్తే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సన్నివేశానికి తక్కువ కష్టపడ్డానని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed