‘యానిమల్’ మూవీ అందుకే చేశా.. సీక్రెట్ బయటపెట్టిన త్రిప్తి దిమ్రి

by sudharani |
‘యానిమల్’ మూవీ అందుకే చేశా.. సీక్రెట్ బయటపెట్టిన త్రిప్తి దిమ్రి
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. ప్రజెంట్ ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఓకే చేస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. ‘యానిమల్’ మూవీతో ఈ బ్యూటీ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇందులో మెయిన్ హీరోయిన్ రష్మిక మందన్నా అయినప్పటికీ.. సెకండ్ హాఫ్‌లో సపోర్టింగ్ రోల్‌లో కనిపించి ‘జోయా’ అలియాస్ త్రిప్తి డిమ్రి కుర్రాల్లో స్పెషల్ క్రేజ్ దక్కించుకుంది.

దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో ఆ అమ్మడు గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ప్రజెంట్ వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. అయితే.. ఈ మూవీలో త్రిప్తి దిమ్రి కాస్త నెగిటివ్ రోల్‌లో కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ అలాంటి రోల్‌లో ఎందుకు నటించిందో చెప్పుకొచ్చింది. త్రిప్తి మాట్లాడుతూ.. ‘మొదటగా ఈ రోల్ గురించి సందీప్ నేరేట్ చేసినప్పుడు భయం వేసింది. కానీ.. ఒక నటిగా నాకు ఛాలెంజింగ్‌గా అనిపించే క్యారెక్టర్లనే ఎంచుకుంటాను. అందుకే ‘యానిమల్’ మూవీలో ఆ రోల్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed