Suhas: దిల్ రాజ్ వాట్సాప్ చాట్ లీక్ చేసిన హీరో సుహాస్.. అందులో ఏముందంటే? (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-09-05 13:08:15.0  )
Suhas: దిల్ రాజ్ వాట్సాప్ చాట్ లీక్ చేసిన హీరో సుహాస్.. అందులో ఏముందంటే? (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, సందీప్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’. ఇందులో సంకీర్తన హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్, హన్షిత నిర్మించారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో.. సుహాస్ దిల్ రాజ్‌తో చేసిన వాట్సాప్ చాటింగ్ లీక్ చేశాడు. ప్రజెంట్ దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న వారంతా ప్రమోషన్స్‌లో భాగంగా తమ సినిమాపై దృష్టి సంపాదించుకునేందుకు ఇలా చేశాడని అంతా అభిప్రాయపడుతున్నారు.

అసలు అందులో ఏముందంటే.. సుహాస్: సర్ మనం ప్రీమియర్ షో వేస్తే బాగుంటుంది. ఈ మధ్య ప్రీమియర్స్ వేసిన సినిమాలన్నీ బాగా వర్కౌట్ అవుతున్నాయి అని పెట్టగా.. దిల్ రాజ్: చూడాలి సుహాస్ ఇప్పటికిప్పుడు అంటే ప్లానింగ్ చేయాలి. నేను అది చెక్ చేసి చెబుతా అని అన్నాడు. దానికి సుహాస్ 6న సాయంత్రం ఏఎంబీ, నెక్లెస్ అన్ని ఓపెన్ చేద్దాం అని పెట్టాడు. ఇక దిల్ రాజ్ టైమ్ ఇవ్వమని కోరాడు. సుహాస్: వాయిస్ రికార్డ్ పంపి ఆయనకు అర్థమయ్యేలా చెప్పి ప్రీమియర్స్ వేసేలా చేశాడు. దీంతో దిల్ రాజ్ వేసేద్దాం అని కన్ఫర్మ్ చేశాడు. ప్రజెంట్ వీరిద్దరి చాట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Click Here For Twitter Link

Advertisement

Next Story

Most Viewed