ఆ డైరెక్టర్ కోరిక తీర్చమని వెంటపడ్డాడు : యంగ్ బ్యూటీ

by Disha News Desk |
ఆ డైరెక్టర్ కోరిక తీర్చమని వెంటపడ్డాడు : యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా : ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలను లైంగికంగా వేధించడంపై టాలీవుడ్ హాట్ బ్యూటీ అప్సరా రాణి స్పందించింది. తనకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందంటూ లేటెస్ట్ ఇంటర్వ్యూలో అప్పటి ఇన్సిడెంట్‌ను పంచుకుంది. 'ఒక కన్నడ సినిమాలో నన్ను హీరోయిన్‏గా సెలెక్ట్ చేశారు. ఓ రోజు మూవీ గురించి డిస్కస్ చేయాలని డైరెక్టర్ పిలిస్తే వెళ్లాను. తీరా అక్కడికెళ్లాక రూమ్‌లో అతనొక్కడే ఉన్నాడు. అయినా నమ్మకంగానే తనతో మాట్లాడుతూ కూర్చున్నాను. అప్పటివరకు దూరంగా ఉన్న డైరెక్టర్ రెప్పపాటులో దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నాడు. కోరిక తీరిస్తేనే ఈ మూవీలో అవకాశం ఇస్తానంటూ ఒత్తిడి చేశాడు' అంటూ చెప్పుకొచ్చింది.ఇక గతేడాది 'సీటీమార్' చిత్రంలో కనిపించిన అప్సర.. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'థ్రిల్లర్' మూవీతో వెండితెరకు పరిచయమైంది. అంతేకాదు 'క్రాక్' సినిమాలో 'భూమ్ బద్దల్' ఐటెం సాంగ్‌లో కుర్రకారును ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed