ధనుష్- ఐశ్వర్య.. మళ్లీ కలవనున్నారా?

by Hamsa |   ( Updated:2022-10-02 09:50:08.0  )
ధనుష్- ఐశ్వర్య.. మళ్లీ కలవనున్నారా?
X

దిశ,సినిమా: తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. దాదాపు 18 ఏళ్ల వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్.. మళ్లీ కలవాలని కోరుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా ఈ జోడి మళ్లీ ఒక్కటవనున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగించి, మళ్లీ కలిపేందుకు కుటుంబ పెద్దల సమక్షంలో రజనీకాంత్ చర్చలు జరిపాడని, వారి మాటను గౌరవిస్తూ ధనుష్, ఐశ్వర్య సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఇవి కూడా చదవండి : మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో టచ్‌లోనే ఉన్నా.. వదులుకోలేనంటున్న రష్మిక

Advertisement

Next Story