ఫ్యాన్స్ ని దారుణంగా హర్ట్ చేసిన అనుపమ..

by Kavitha |   ( Updated:2024-01-01 10:53:59.0  )
ఫ్యాన్స్ ని దారుణంగా హర్ట్ చేసిన అనుపమ..
X

దిశ, సినిమా : యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఇందులో అనుపమ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూ ఇయర్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ముఖ్యంగా అనుపమ ఫ్యాన్స్ కు ఇది ఊహించని షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ పోస్టర్ లో అనుపమ తొడల దాకా ఉన్న బ్యాక్ లెస్ బ్లాక్ డ్రెస్‌లో, సిద్ధు మీద కూర్చొని... ఓ సెక్సీ ఫోజు ఇచ్చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మ అభిమానులు ‘ఎలా ఉండే అను బేబీ ని ఎలా చేశావురా టిల్లూ...’ అంటూ ‘ఇప్పుడు చూపిస్తున్న ఈ యాంగిల్ ఏదో.. కెరీర్ ఆరంభంలో చూపించి ఉంటే చాలా బాగుండేది..’ అని కామెంట్స్ లు చేస్తున్నారు.

ఎందుకంటే ఈ చిన్నది కెరీర్ ఆరంభం నుండి ఎలాంటి స్కీన్ షో చేయలేదు. అంతేకాదు ఆ మధ్య ఇన్‌స్టాలో ఓ హాట్ ఫోటో పోస్ట్ చేస్తే, తన ఫ్యాన్స్ ఫీల్ అయ్యారని... దాన్ని డిలీట్ చేసి, మళ్లీ ఇలాంటి పోస్ట్ చేయనని కూడా చెప్పింది అనుపమ పరమేశ్వరన్. కానీ ఇప్పుడు ఇలా రెచ్చిపోయిందంటే దానికి కారణం అవకాశాలు తగ్గిపోవడం అని అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ న్యూ ఇయర్ పోస్టర్ తో తన ఫ్యాన్స్ ని మాత్రం బాగా హర్ట్ చేసింది అనుపమ.

Advertisement

Next Story