Rana Daggubati: మా కుటుంబంలోని అనుబంధాల‌ను తెలియ‌జేసే చిత్రం: రానా దగ్గుబాటి

by Hamsa |
Rana Daggubati: మా కుటుంబంలోని అనుబంధాల‌ను తెలియ‌జేసే చిత్రం: రానా దగ్గుబాటి
X

దిశ, సినిమా: అలియా భ‌ట్, వేదాంత్ రైనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జిగ్రా’. ఈ మూవీని వ‌యాకామ్ 18 స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్షన్స్‌, ఎట‌ర్‌న‌ల్ షైన్ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్స్ స‌మ‌ర్పణ‌లో కర‌ణ్ జోహార్, అపూర్వ మెహ‌తా, అలియా భ‌ట్‌, షాహిన్ భ‌ట్, సోమెన్ మిశ్రా నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ‘జిగ్రా’ చిత్రం అక్టోబ‌ర్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన హిందీ ట్రైలర్ హైప్‌ను క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీని తెలుగులో ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌పై రానా ద‌గ్గుబాటి విడుదల చేస్తున్నారు. తాజాగా, జిగ్రా తెలుగు ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా.. రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ ‘‘జిగ్రా క‌థ‌లో మంచి సోల్ ఉంది. భాష‌తో సంబంధం లేకుండా ఎవ‌రికైనా ఇది క‌నెక్ట్ అవుతుంది. ఇలాంటి వైవిధ్యమైన క‌థ‌తో రూపొందిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల‌కు అందించాల‌ని భావించాం. అందుక‌నే ధ‌ర్మ ప్రొడక్షన్స్‌తో క‌లిసి నేను, ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్ ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్నామ‌ని గ‌ర్వంగా తెలియ‌జేస్తున్నాం. ‘జిగ్రా’ అనేది కేవ‌లం యాక్షన్ చిత్రం మాత్రమే కాదు.. మా కుటుంబంలోని అనుబంధాల‌ను తెలియ‌జేసే చిత్రం. మ‌నం ఎంతగానో ప్రేమించే వ్యక్తుల‌ను మనం ఎలా కాపాడుకోవాలో తెలియ‌జెప్పే సినిమా. అలియా భ‌ట్‌, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో న‌టించిన ఈ చిత్రం భాష‌, స‌రిహ‌ద్దుల‌తో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల‌కు అద్భుత‌మైన అనుభవాన్ని అందిస్తుంద‌న‌టంలో సందేహం లేదు’’ అన్నారు.

Advertisement

Next Story