- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా చేయడం బ్లడీ షేమ్ ఇప్పటికైనా వారికి చెప్పు.. విజయ్‌పై కస్తూరీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: విజయ్, లోకేష్ కనగరాజన్ కాంబినేషన్‌లో లియో మూవీ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇది అత్యధిక వ్యూస్ సాధించి యూట్యూబ్ షేక్ చేసింది. అంతేకాకుండా కొంత మంది విజయ్ ఫ్యాన్స్ కోసం లియో ట్రైలర్‌ను థియేటర్లో వేశారు. ఇక ఇరగబడి జనం వచ్చారు. లియో ట్రైలర్ దెబ్బకు థియేటర్ దద్దరిల్లిపోయింది. విజయ్ ఫ్యాన్స్ పిచ్చి పట్టినట్టుగా చేశారు. థియేటర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు.
తాజాగా, ఈ ఘటనపై నటి కస్తూరి శంకర్ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఇది చాలా దారుణం.. అది బ్లడీ స్వీట్ కాదు.. బ్లడీ షేమ్.. ఓ విజయ్ ఫ్యాన్‌గా ఇది నన్ను చాలా బాధిస్తోంది. ఇది కచ్చితంగా అంగీకారమైన పని కాదు. పబ్లిక్ ప్రాపర్టీ ఇలా డ్యామేజ్ చేయడం కరెక్టా?.. ఓ సినిమా కోసం ఇలా చేస్తారా?.. లీడర్ అవ్వాలనే కోరిక విజయ్‌కి ఉంటే.. వారి ఫ్యాన్స్‌తో మాట్లాడి సరైన దిశలో పెట్టడానికి ఇదే సరైన టైమ్’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఫ్యాన్స్ థియేటర్‌ను ద్వంసం చేసిన వీడియోను షేర్ చేసింది. దీంతో కస్తూరి పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
This is horrible. Not #BloodySweet this is a #bloodyShame ! As a Vijay fan, it pains me to see such vandalism. This is NOT acceptable. Damaging public property? For a movie!!!If thalapathy has leadership ambitions, this would be a good time for him to speak to his fans! #Leo https://t.co/SXh6JoohNB
— Kasturi (@KasthuriShankar) October 5, 2023