ప్రభాస్ మద్యం సేవిస్తాడా.. షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన AI !

by Jakkula Samataha |   ( Updated:2024-07-03 15:57:32.0  )
ప్రభాస్ మద్యం సేవిస్తాడా.. షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన AI !
X

దిశ, సినిమా : డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన కట్ ఔట్, అందం, నటనకు ఎవ్వరైనా సరే పడిపోవాల్సిందే. ఈ హీరోకు మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. అమ్మాయిలకు ఈయన అంటే ఎక్కువ ఇష్టం. అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి.

తాజాగా ఏఐ ప్రభాస్‌కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్‌ను బయట పెట్టింది. ఇంతకీ ఆ విషయం ఏంటి అని ఆలోచిస్తున్నారా? చిత్ర పరిశ్రమలో చాలా మంది మద్యం సేవిస్తారు. అయితే కొంత మంది ఆ విషయాన్ని ఓపెన్‌గా చెప్పుకొస్తే మరికొందరు మాత్రం, సీక్రెట్‌గా ఉంచుతారు. ఇక కొందరు హీరోలు ఫంక్షన్స్‌లో, ఇంట్లో మాత్రమే మద్యం సేవిస్తే, మరికొందరు హీరోలు రోజూ మందుతాగుతుంటారు. అయితే మన హీరో ప్రభాస్‌కు మద్యం అలవాటు ఉందా అంటే? దీని గురించి ఎవరికీ సరిగ్గా తెలియదు. అయితే తాజగా వాట్సాప్‌లోకి కొత్త ఫీచర్, మెటా ఏఐ వచ్చిన విషయం తెలిసిందే. అది ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతోంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్, ప్రభాస్‌కు మద్యం సేవించే అలవాటు ఉందా అని అడగ్గా, దానికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

ఏఐ సమాధానం ఇస్తూ.. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రభాస్‌కు గతంలో మద్యం అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు తాగుతున్నాడా, మానేశారా? అనేదానిపై పూర్తి స్పష్టత లేదు. కృష్ణం రాజు మరణం తర్వాత మద్యానికి బానిస అయ్యానని, డార్లింగ్ ప్రభాస్ 2010లో చెప్పారు. అలాగే ఆయనకు లివర్ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హెల్తీ లైఫ్ స్టైల్‌కు అలవాటు పడినట్లు సమాచారం. అని సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా , ఏఐ సమాధానం చెబుతూ ఇది స్పష్టమైన సమాచారం కాదని చెప్పుకొచ్చింది. దీంతో ఇది నిజమో, కాదో తెలియని అయోమయంలో ఉన్నారు తమ అభిమానులు. కొందరు మాత్రం మా డార్లింగ్ ప్రభాస్‌కు గతంలో మద్యం సేవించే అలవాటు ఉండేదా? అయినా ఇప్పుడు మానేశారుగా, మంచి పని చేశారంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read More..

ప్రభాస్ ‘కల్కి’ మూవీపై రణ్‌వీర్ సింగ్ ఆసక్తికర పోస్ట్.. దీపిక నటన గురించి ఏం చెప్పాడంటే?

Advertisement

Next Story

Most Viewed