- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చంద్రమోహన్‌తో ఒక్కసారి చేస్తే చాలు.. పడిచచ్చిన అలనాటి హీరోయిన్లు..
దిశ, సినిమా: తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.మరోనట దిగ్గజం చంద్రమోహన్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, తెలుగు ప్రేక్షకులు ఆయన మృతిపట్ల నివాళులు అర్పిస్తూ.. కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రమోహన్ గురించి ఒక్కో ఆసక్తికర వార్త బయటకు వస్తు్ంది. ఇందులో భాగంగా ఎంతోమంది హీరోయిన్లకు చంద్రమోహన్ లక్కీ హీరోగా మారిపోయాడని తెలుస్తుంది. ఏ హీరోయిన్ అయినా ఒక్క సినిమా చంద్రమోహన్‌తో చేస్తే దశ మారిపోయేది. అలా ఆయనతో నటించిన తర్వాతే శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి, విజయ నిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ వంటి ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా ఎదిగారు.
ఇది కనుక పరిశీలిస్తే కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 1976లో వచ్చిన ‘సిరిసిరిమువ్వలు’ చిత్రంలో చంద్రమోహన్‌కు జోడిగా జయప్రద హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ తోనే. కాగా ఈ సినిమాతో జాక్‌పాట్ కొట్టిన జయప్రద.. తర్వాత ఎన్టీఆర్ సరసన ‘అడవి రాముడు’, ‘యమగోల’ వంటి సినిమాల్లో నటించింది. 1978లో ‘పదహారేళ్ల వయసు’ సినిమాతో శ్రీదేవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కూడా హీరో చంద్రమోహన్ గారే. ఇక ఈ మూవీ తర్వాత శ్రీదేవి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తర్వాత జయసుధ.. ఆయనకు జంటగా ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెరంగేట్రం చేసింది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మొత్తంగా చూసుకుంటే ఆయన పక్కన నటించిన దాదాపు 60 మంది కథానాయికలు అగ్ర స్థానానికి చేరుకున్నారు. కానీ స్టార్ హీరోయిన్స్‌కు కెరీర్ ఇచ్చిన చంద్రమోహన్ మాత్రం స్టార్ హీరో కాలేకపోయాడు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వూలో కూడా చెప్పాడు చంద్రమోహన్.
Read More..