- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా శరీరంలో మరే పార్టు లేదా?.. నడుమునే ఎందుకు చూపిస్తున్నారంటూ వార్నింగ్ ఇచ్చిన గోవా బ్యూటీ
దిశ, సినిమా : సినీ నటి, గోవా బ్యూటీ, సన్న నడుము చిన్నది ఇలియానా ఎంత పాపులరో తెలిసిందే. అందం, అభినయం, నటన, నడుము వంపులతో కుర్రకారు మనసు దోచిన ఈ బ్యూటీ, తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపింది. దాదాపు 15 ఏండ్లపాటు హీరోయిన్‌గా రాణించిన ఈ భామ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. రెండు సార్లు లవ్ ఫెయిల్యూర్ తర్వాత ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా ఆ పాపకు తండ్రి ఎవరో కూడా పరిచయం చేసింది. కానీ ప్రస్తుతం మళ్లీ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు సమాచారం.
ఇకపోతే సినిమాల్లో ఇలియానాకు అంత మంచి ఫేమ్ రావడం వెనుక ఆమె నటనతోపాటు నడుము ప్రధాన కారణమని చెప్తుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ‘సన్న నడుము’ హీరోయిన్‌గా అందరినీ ఆకట్టుకుంది. ఆమెతో మూవీస్ చేసిన డైరెక్టర్లందరూ ప్రధానంగా ఆమె నడుముపైనే ఫోకస్ పెట్టేవారట. పోకిరి సినిమా మొదలుకొని దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని.. వరకు దాదాపు ప్రతీ సినిమాలో ఇలియానా నడుమునే ఎక్కువగా చూపించారు.
అప్పట్లో సినీ పరిశ్రమ అంతటా ఈ గోవా బ్యూటీ నడుముపై క్రేజీ డిస్కషన్ నడిచింది. ఆమె నడుమును వర్ణిస్తూ ఎన్నో పాటలు, కవితలు కూడా వచ్చాయి. అయితే ఎక్కువగా తన నడుమునే ఫోకస్ చేయడంపట్ల ఇలియానా చాలాసార్లు అభ్యంతరం తెలిపిందట. ఒకరోజు తనతో సినిమాలు తీసిన డైరెక్టర్ల మీద సీరియస్ అవుతూ.. ‘నా శరీరంలో మరే పార్టు లేనట్టు.. ఎందుకని నా నడుమునే చూపిస్తున్నారు’’ అంటూ వార్నింగ్ ఇచ్చిందట. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ఇలియానా పంచుకున్న ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘నడుము వల్లే కదా నువ్వు అంత ఫేమస్ అయ్యావు’ అంటూ మరి కొందరు తెగ పొగిడేస్తున్నారు.