స్టార్ హీరో కొడుకు వేధింపులు.. కృతి శెట్టి పోస్ట్ వైరల్!

by sudharani |   ( Updated:2023-07-08 12:47:50.0  )
స్టార్ హీరో కొడుకు వేధింపులు.. కృతి శెట్టి పోస్ట్ వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో.. వరుస ఆఫర్లు అమ్మడు చెంతకు చేరాయి. కానీ, స్టోరీస్ ఎంచుకోవడంలో మిస్ ఫైర్ అయిన బ్యూటీ ప్లాప్ సినిమాలతో చతికిల పడిపోయింది. ప్రస్తుతం బేబమ్మ మూవీ ఆఫర్లు లేక ఖాళీగా ఉన్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడుని ఓ స్టార్ హీరో కొడుకు వేధిస్తున్నాడని.. ఆమెతో పరిచయం పెంచుకునేందుకు బర్త్‌డే పార్టీలకు రమ్మని ఇబ్బంది పెడుతున్నట్లు, అలాగే ఆమె వెళ్లిన ప్రతి ఈవెంట్‌కి వెళ్లి అక్కడ తనని వేధింపులకు గురిచేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన కృతి తన ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ చేసింది. ఈ మేరకు ‘‘దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడం ఆపండి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానండి. ఎందుకంటే ఇది చాలా నిరాధారమైన రూమర్’’ అంటూ చెప్పుకొచ్చింది బ్యూటీ. కాగా.. కృతి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed