డైరెక్టర్లకు అమ్మాయిల సప్లై.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సీనియర్ నటి!

by Jakkula Mamatha |   ( Updated:2024-04-19 15:22:18.0  )
డైరెక్టర్లకు అమ్మాయిల సప్లై.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సీనియర్ నటి!
X

దిశ,వెబ్‌డెస్క్:చిత్ర పరిశ్రమ అంటే అదో పెద్ద ప్రపంచం. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కాస్టింగ్ కౌట్, మీటూ, కమిట్‌మెంట్ ఇలా ఎన్నో ఇష్యూస్ దాని చుట్టే తిరుగుతాయి. అంతే కాకుండా కొందరు నటీనటులు సైతం చాలా ఇబ్బందులు, ఆరోపణలు ఎదుర్కొంటారు. అలాంటి వారిలో వైజాగ్ జగదీశ్వరి ఒకరు. ఆమె చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆమెపై గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. అమ్మాయిలను సప్లై చేసేది,యంగ్ బ్యూటీస్‌ను సప్లై చేసి సినిమాల్లో ఆఫర్స్ కొట్టేస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి దీనికి సంబంధించిన విషయాలపై స్పందించింది.

ఆమె మాట్లాడుతూ..అమ్మాయిలను సప్లై చేయడం అనేది అవాస్తవమని, తనపై కావాలని కొందరు ఇలాంటి ఆరోపణలు చేశారని చెప్పారు. నా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పుకొచ్చింది. నేను డైరెక్టర్స్‌కు అమ్మాయిలను సప్లై చేసేదాన్ని అన్నారు. కానీ నేను బోరబండలో ఉండటం వలన సినిమా సెట్స్‌కు వెళ్లి రావడానికి రూట్స్ తెలియకపోయేవి. దీంతో మా దగ్గరిలో ఉండే అమ్మాయిలను తీసుకెళ్లేదానిని. అంతే తప్ప నేను అలాంటి పనులు చేయలేదు. కొందరు కావాలనే నా మీద నిందలు వేశారు. ప్రస్తుతం నేను చాలా పేదరికంలో ఉన్నాను. అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed