రీ రిలీజ్‌కు సిద్ధమైన 'ఆది'.. తారక్ ఫ్యాన్స్‌కు పూనకాలే

by sudharani |   ( Updated:2022-09-26 13:23:33.0  )
రీ రిలీజ్‌కు సిద్ధమైన ఆది.. తారక్ ఫ్యాన్స్‌కు పూనకాలే
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అందులో భాగంగానే మొదటగా విడుదలైన 'పోకిరి', 'జల్సా', 'చెన్నకేశవరెడ్డి' వంటి చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో మరిన్ని సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్‌టీ‌ఆర్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి 22 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా 'ఆది' సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్నట్లు చిత్ర నిర్మాత న‌ల్లమ‌ల‌పు బుజ్జి తెలిపారు. న‌వంబ‌ర్ మూడో వారంలో థియేట‌ర్లలో పాటు ఓవ‌ర్‌సీస్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

అయోధ్యలో అర్జునుడు'.. మహే‌ష్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఫిక్స్?

Advertisement

Next Story