- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Devara Movie: ఆనందం అప్పుడే అయిపోలేదయ్యా ఇప్పుడే స్టార్ట్ అంటూ.. దేవర పై లిరిసిస్ట్ ట్వీట్..
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ దేవర ట్రైలర్ మంగళ వారం సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. ట్రైలర్ చూస్తుంటే అన్ని కథల మాదిరిగానే ఉన్నా విజువల్స్, యాక్షన్ సీన్స్ ఇంత వరకు చూడని విధంగా ఉండనున్నాయని తెలుస్తుంది. ట్రైలర్ తో రిలీజ్ అయ్యాక అప్పటి వరకు ఉన్న అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో ఈ మూవీ కోసం అటు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ హైప్ ని ఇంకా పెంచుతూ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఓ ఆసక్తికర ట్వీట్ కూడా చేసారు.
రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆనందం అప్పుడే అయిపోలేదయ్యా.. ఇప్పుడే మొదలు.. ఆయుధపూజ పాట వస్తే ఇంక పట్టలేం మిమ్మల్ని…ఆ.. అంటూ కొత్తగా ట్వీట్ చేసారు. అంటే ఇక్కడే అర్ధమవుతుంది.. ఆయుధ పూజ పాట సినిమాకే హైలెట్ అని.. ఇలా ఆ సినిమాలో పని చేసిన అందరూ ప్రేక్షకులకు అంచనాలను గట్టిగానే పెంచుతున్నారు. ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చాలా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.