- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harihara Veeramallu : 'హరిహర వీరమల్లు' నుంచి ఆ సీనియర్ నటుడు అవుట్...!
దిశ, వెబ్ డెస్క్ : నిర్మాత ఏ.ఎం రత్నం, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది. వాస్తవానికి భీమ్లానాయక్ పూర్తైన వెంటనే హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభమైంది. ఇంతలోనే సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ తో 'బ్రో' సినిమా పట్టాలెక్కింది.
తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతుందనకున్నా క్రిష్ మూవీకి అడ్డంకిగా హరీష్ శంకర్ దర్శకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్' నిలిచింది. ఆ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా ముగిసింది. 'హరిహర వీరమల్లు' షూటింగ్ కు తిరిగి డేట్లు ఇస్తారనుకున్న పవన్ అనూహ్యంగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న 'ఒజీ'కి డేట్లు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో విసిగి వేసారిపోయిన ఓ సీనియర్ నటుడు హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు సమాచారం.
ఆ మధ్య దర్శకుడు క్రిష్ కూడా సినిమా నుంచి వెళ్లిపోతారనే వార్తలొచ్చాయి. ఇక సినిమా విషయానికి వస్తే చాలా నెలల క్రితం మొదలైన మూవీ నిదానంగా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తుంది. పవన్ మిగిలిన సినిమాకు డేట్స్ ఇస్తూ.. హరిహర వీరమల్లుకు సమయం ఇవ్వకపోవడంతో అటు నిర్మాత, ఇటు దర్శకుడు పునరాలోచనలో పడినట్లు సమాచారం.
Also Read: రామ్ చరణ్ పాపకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన శర్వానంద్.. నువ్వు సూపర్ అంటున్న ఫ్యాన్స్?