- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకే నేను పెళ్లి చేసుకోలేదంటూ.. అసలు విషయం చెప్పిన సీనియర్ హీరోయిన్ సదా
దిశ,వెబ్ డెస్క్: జయం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అందాల భామ సదా. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో నటించింది. అపరిచితుడు సినిమాలో విక్రమ్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించింది.అప్పట్లో ఈమె పేరు మారుమ్రోగింది. కానీ మెల్లగా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఈ అమ్మడు సినిమాల్లో కనిపించకుండాపోయింది. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ గా సత్తా చాటాలని పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఇంత వరకు సదా ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలిపింది. 'నేను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇంత సంతోషంగా ఉన్నాను.. నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉంది, వైల్డ్ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, జంతువులను ప్రేమించడం చాలా ఇష్టమని తెలిపింది, పెళ్లి చేసుకుంటే ఇవన్నీ నాకు దొరకవు.. ముఖ్యంగా మనల్ని అందరు ఒకేలా అర్ధం చేసుకోలేరు, పైగా ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు.. దాని కన్నా పెళ్లి చేసుకోకపోవడమే చాలా బెటర్' అంటూ తన మాటల్లో చెప్పుకొచ్చింది.
Also Read: ఆమెతో జాగ్రత్త అంటూ నయనతార భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుఖ్.. ట్వీట్ వైరల్..