నేను ఆనందించే ఏకైక డ్రామా అదే.. యంగ్ బ్యూటీ పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2024-06-03 11:30:13.0  )
నేను ఆనందించే ఏకైక డ్రామా అదే.. యంగ్ బ్యూటీ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తుంది. ‘అ..ఆ..’, ‘శతమానంభవతి’ వంటి మూవీస్‌లో తెలుగింటి ఆడపడుచులా కనిపించి మెప్పించిన ఈ అమ్మడు.. ‘టిల్లు స్వ్కేర్’ చిత్రంలో బోల్డ్‌గా దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఇందులో అనుపమ క్యారెక్టర్‌కు విమర్శలు వచ్చినప్పటికీ.. ఆమె యాక్టింగ్‌కు ప్రసంశలు అందుకుంది. ప్రజెంట్ ఈ బ్యూటీ ‘పరదా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఓ సరికొత్త కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉంది అనుపమ.

అయితే.. షూటింగ్‌ల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ప్రేక్షకులతో పంచుకోవడంతో పాటు.. క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘నేను ఆనందించే ఏకైక నాటకం నా కనురెప్పలలో మాత్రమే ఉంది’ అనే క్యాప్షన్ ఇచ్చి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట సందడి చేస్తున్నాయి.

Advertisement

Next Story