- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఆయనను చూసిన తర్వాత కన్నీళ్ళు వచ్చాయి.. పరిణీతి చోప్రా ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా తన అందం, నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. అలాగే పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆప్ లీడర్ రాఘవ చద్దాను ప్రేమించి 2023లో ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆమె ఇటీవల ‘అమర్ సింగ్ చమ్‌కీలా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్‌లో థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, పరిణీతి చోప్రా ఇన్‌స్టా ద్వారా ఓ పోస్ట్ షేర్ చేసింది. వినాయకుడిని దర్శించుకున్న ఆమె ఎమోషనల్ అయింది. ‘‘నా గుండె నిండుగా ఉంది. మీరు అతని పాదాలను చేరుకున్నప్పుడు, మీ కళ్ళలో కన్నీళ్లు ఆపలేరు కదా.. ఇప్పుడు ఆ కన్నీళ్లను నా ముఖంలో మీరు చూడవచ్చు. ఆయనను చూసిన తర్వాత నా కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయి. దివ్యమైన అందమైన, మా గన్ను రాజా జైదేవ్ జైదేవ్!’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు గణపతి బప్పా మోరియా అని కామెంట్లు పెడుతున్నారు.