ఆలస్యం చేయకుండా యాక్షన్‌లోకి దిగిపోయిన తారక్.. ‘Devara’ కోసం తెగ కష్టపడుతున్నాడట!

by Prasanna |   ( Updated:2023-09-19 15:20:20.0  )
ఆలస్యం చేయకుండా యాక్షన్‌లోకి దిగిపోయిన తారక్.. ‘Devara’ కోసం తెగ కష్టపడుతున్నాడట!
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్‌కు తారక్ ఇటీవల బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా సైమా అవార్డ్స్ కోసం దుబాయ్ వెళ్లిన ఆయన మళ్లీ రిటర్న్ కాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. కొత్త షెడ్యూల్‌ ప్రకారం షూట్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు బుధవారం నుంచి ఎన్టీఆర్‌పై సోల్మన్ మాస్టర్ కొరియోగ్రఫీలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ యాక్షన్ షెడ్యూల్‌లో ఆయనతోపాటు సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్‌ కూడా పాల్గొనబోతున్నారని, దీని తర్వాత మేకర్స్ మరో లెంథీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీలో తారక్ లుక్ అదిరిపోయేలా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడట డైరెక్టర్. మొత్తానికి వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమాపై ఫ్యాన్స్‌లో ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

ఇవి కూడా చదవండి : Vijay Leo : విజయ్ ‘లియో’ ఆడియో లాంచ్‌ ఈవెంట్ డేట్ ఫిక్స్..

Advertisement

Next Story