విజయ్‌‌తో డేటింగ్ రూమర్స్.. అసలు నిజం చెప్పిన తమన్న

by Hamsa |   ( Updated:2023-03-03 09:40:43.0  )
విజయ్‌‌తో డేటింగ్ రూమర్స్.. అసలు నిజం చెప్పిన తమన్న
X

దిశ, సినిమా: విజయ్‌ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలను తమన్న కొట్టిపారేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరైన నటి.. ‘సౌత్‌ ఫ్యాన్స్ నన్ను మిల్కీబ్యూటీ అని పిలుస్తారు. నా కలర్ వల్ల అలా పిలుస్తారు అనుకుంటా. ఒక నటిగా నేను ఫ్యాన్స్ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలను. రిసెంట్‌గా నా ఫ్యాన్స్ కొందరు నేను లవ్‌లో ఉన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. వాటిని నేను కూడా చదివా. అవీ చాలా ఫన్నీగా అనిపించాయి. ఇవన్నీ ఎవరు రాస్తున్నారో తెలియదు. కానీ, ప్రతి ఒక్కరికి జీవితం ఉంటుంది. నా జీవితంలో చాలా ప్రేమ పొందాను. కానీ, కొన్ని విషయాల్లో నెగెటివిటీ పెరిగిపోయింది’ అంటూ తనపై వస్తున్న రూమర్స్‌‌కు చెక్ పెట్టేసింది.

ఇవి కూడా చదవండి : ఫస్ట్ నైట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ.. నెటిజన్స్ ఫైర్

Advertisement

Next Story