- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PRABHAS: ప్రభాస్ పెళ్లి తేదీ అండ్ అమ్మాయి ఫిక్స్.. హైదరాబాదులో రెబల్ స్టార్ పెళ్లి షాపింగ్ ఇక్కడే: పెద్దమ్మ శ్యామలాదేవి
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే ‘సలార్’ చిత్రంతో భారీ హిట్ కొట్టాడు. నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం జూన్ 27వ తేదీన థియేటర్లలోకి వచ్చి.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. వరల్డ్ వైడ్ గా ఏకంగా 1100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.
ఇకపోతే తరచూ రెబల్ స్టార్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అభిమానులు పెళ్లిపై ప్రశ్నించగా.. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్ల దొరకడం లేదంటూ సిల్లీ సిల్లీ రీజన్స్ చెబుతూ తప్పించుకుంటున్నాడు. అయితే తాజాగా హైదరాబాదులో గాయత్రీ, అభిలాష రెడ్డి అనే మరో మహిళతో చీరల వ్యాపారం స్టార్ట్ చేశారు. ఈ షాప్ ఓపెనింగ్ కు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి, హైదరాబాదు మేయర్, రక్షిత్ అట్లూరి వెళ్లారు. అనంతరం శ్యామలాదేవి మీడియా వారితో ప్రభాస్ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది.
ఆమెకు పట్టు శారీస్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. కృష్ణంరాజు తనకు ఫస్ట్ టైమ్ కంచిపట్టు చీర కొన్నారని వెల్లడించారు. అలాగే ప్రభాస్ పెళ్లికి ఇక్కడే షాపింగ్ చేస్తామని, మంచి శారీ కలెక్షన్ ఉందని చెప్పింది. దీంతో ఫ్యాన్స్ ఎగిరిగంతులేస్తున్నారు. శ్యామలాదేవి ఏకంగా పెళ్లి షాపింగ్ గురించే మాట్లాడిందంటే.. ఆల్రెడీ వివాహ తేదీ కూడా నిర్ణయించబడింది. కానీ రివీల్ చేయట్లేదు.త్వరలోనే అమ్మాయి అండ్ ముహూర్తం టైమ్ చెబుతారంటూ ఫ్యాన్స్‌కు మురిసిపోతున్నారు.