ఐటెమ్ సాంగ్స్ చేసినందుకు గర్వపడుతున్నా: మాజీ మిస్ యూనివర్స్

by samatah |
ఐటెమ్ సాంగ్స్ చేసినందుకు గర్వపడుతున్నా: మాజీ మిస్ యూనివర్స్
X

దిశ, సినిమా :సినిమాల్లో తను ఐటమ్ సాంగ్స్ చేయడానికి బలమైన కారణం ఉందంటోంది సుస్మితా సేన్. స్టార్ హీరోయిన్లు బోల్డ్ సీన్లు, సాంగ్స్ చేయడానికి ఇష్టపడేవారు కాదని.. దీంతో దర్శకనిర్మాతలు తనను ఎంచుకున్నారని తాజా ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. ‘ఆ సమయంలో స్కిన్ షో చేసేందుకు, కాస్త రొమాంటిక్ పాటల్లో నటించేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు కాదు. అది వారి కీర్తి ప్రతిష్టలకి సమస్య అవుతుందని భావించేవారు. కానీ, నేను భయంలేకుండా ఒప్పుకున్నా. మిస్ యూనివర్స్ అనే ఇమెజ్‌తో నాపై భారీ ఎత్తున్న విమర్శలు వచ్చాయి. నా మేనేజర్స్ నా దగ్గర పని మానేశారు. అయినా నేను వెనకడుగు వేయలేదు. దానికి నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్లు సైతం అలాంటి సాంగ్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు సినిమా ఆకట్టుకోలేకపోయినా సంగీతమే ప్రేక్షకులను అలరిస్తుంది’ అంటూ గత అనుభవాలను గుర్తుచేసుకుంది.

Advertisement

Next Story