సెక్స్ సినిమాలు తీశానని అసహ్యించుకుంటారా?.. పోర్న్ స్టార్

by Manoj |   ( Updated:2022-06-09 16:57:06.0  )
సెక్స్ సినిమాలు తీశానని అసహ్యించుకుంటారా?.. పోర్న్ స్టార్
X

దిశ, సినిమా: మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన మనసులోని మాట బయటపెట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు అడల్డ్ ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడిన సన్నీ.. గతం కారణంగా తనపై పిల్లల భావన మారుతుందనే ఆందోళన వ్యక్తం చేసింది. 'పిల్లలు పెద్దయ్యాక నా గతం గురించి తెలుసుకుని ఆసహ్యించుకోవచ్చు. నా జీవిత ప్రయాణం గురించి ప్రశ్నించే క్రమంలో అన్ని విషయాలు బయటపడతాయి. అయితే నేను నాకు ఇష్టమున్న పనినే చేశాను. పిల్లలకు కూడా నచ్చిన పని చేయమనే చెబుతున్నాం. ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకు ఏ పనైనా చేసుకుని బతకొచ్చు' అని చెప్పుకొచ్చింది. ఇక తన కొడుకుల్లో ఒకరు ఫైర్ ఫైటర్ కావాలన్న నటి.. కూతురు పియానో వాయించడంలో తన అభిరుచులను అనుసరిస్తున్నట్లు తెలిపింది. చివరగా 'పిల్లలు చేసే మంచి పనులకు పేరెంట్స్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలవాలి' అని కోరిన మాజీ పోర్న్ స్టార్‌కు నాలుగు ఏళ్ల కవల అబ్బాయిలు ఆషర్, నోహ్ ఏడేళ్ల దత్తపుత్రిక నిషా ఉన్నారు.

అతడితో సెక్స్.. అక్కడ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందన్న నటి

Advertisement

Next Story

Most Viewed