స్టేడియంలో బూతులు మాట్లాడిన షారుఖ్ కూతురు.. ‘ఫక్’ అంటూ

by Anjali |   ( Updated:2023-05-19 06:59:19.0  )
స్టేడియంలో బూతులు మాట్లాడిన షారుఖ్ కూతురు.. ‘ఫక్’ అంటూ
X

దిశ, సినిమా: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ప్రవర్తన హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ కిడ్‌గా నెట్టింట భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె ఇటీవల ఓ ఇండియన్ క్రికెటర్‌ను ఉద్దేశిస్తూ పలికిన బూతు పదం చర్చనీయాంశమైంది. విషయానికొస్తే.. 2023 ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా ఏప్రిల్ 16 ఆదివారం కేకేఆర్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన సుహాన తమ టీమ్ కేకేఆర్‌ను ఎంకరేజ్ చేస్తూ స్టాండ్స్‌లో సందడి చేసింది. ఈ క్రమంలోనే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆనందంగా లేచి నిలబడి సెలబ్రేట్ చేసుకున్న సుహాన ‘ఫక్ ఆఫ్’ అంటూ పలికిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో సుహానా ‘ఎఫ్’ పదం వాడిందా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

Read more:

నా జీవితం అసురక్షితమైన మగాళ్లతో నిండి ఉంది.. ప్రియాంక

Advertisement

Next Story