సుధీర్ బాబు "హంట్" మూవీ ట్రైలర్ అదుర్స్..!

by Prasanna |   ( Updated:2023-01-18 06:31:24.0  )
సుధీర్ బాబు హంట్ మూవీ ట్రైలర్ అదుర్స్..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం ''హంట్''. యంగ్ డైరెక్టర్ మహేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సాలిడ్ యాక్షన్ మూవీ రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీకాంత్, 'ప్రేమిస్తే' మూవీ ఫేమ్ భరత్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ ఈరోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లర్‌గా ఉందనే చెప్పాలి. అలాగే సుధీర్ బాబు నటనలో చాలా మంచి ఇంప్రూవ్ మెంట్ కనిపిస్తుంది. శ్రీకాంత్ నటన, క్యాస్టింగ్ చుట్టూ ఉన్న సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆసక్తిగా ఉన్నాయి. సంగీత దర్శకుడు జిబ్రాన్ సంగీతం కూడా హైలెట్‌గా నిలిచింది.

Also Read: అజయ్ దేవగన్ డైరక్షన్‌లో పోలీస్‌గా టబు.. ఫస్ట్ లుక్ రిలీజ్(వీడియో)

Advertisement

Next Story