- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేశ్యగా మారిన హీరోయిన్.. ఆ నిర్మాతే ఆమెను తప్పటడుగు వేయించాడా..? (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం. ఇందులో నెగ్గుకురావడం చాలా కష్టం. పైకి రంగులు వేసుకుని అందరిని అలరించడం మాత్రమే బయటి ప్రపంచానికి తెలిసిన విషయం. ఆ రంగుల వెనుక ఒక చీకటి ప్రపంచం ఉంటుందని చాలా తక్కువ మందికే తెలుసు. ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తులో నిలబెట్టి.. అంతే వేగంగా నేలకూల్చగల శక్తి సినిమా రంగానికి ఉంది. ఓవర్‌నైట్ స్టార్స్ అయ్యి.. నిర్మాతలు ఇంటిదగ్గర క్యూ కట్టే స్టేజ్ నుంచి.. ఒక్క అవకాశం కోసం డోర్ వైపు ఎదురుచూస్తూ బతికేలా చేయగలదు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక ఈ చీకటి ప్రపంచంలో ఎంతో మంది తారలు కనుమరుగు అయిపోయారు. అలాంటి తారల్లో ఒకప్పటి హీరోయిన్ నిషా నూర్ ఉదాహరణ.
ఒకప్పుడు బహుభాషా నటిగా పేరు తెచ్చుకుని, స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన నిషా.. చివరకు అనాథగా, అధ్వాన స్థితిలో మరణించింది. ఆమె జీవితం వర్ధమాన తారలకు ఒక పాఠం. నటనను నమ్ముకుని తొలినాళ్లలో సినీరంగంలో మెరిసినా ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితిలో ఒళ్లు అమ్ముకుంది. కెరీర్ పీక్లో ఉన్న సమయంలో తప్పటడుగు వేసిన ఈ నటి అత్యంత దీన స్థితిలో 2007లో ఎయిడ్స్ వ్యాధిలో మృతి చెందింది. 1962 సెప్టెంబర్ 18న తమిళనాడులోని నాగపట్నంలో పుట్టిన నిషా.. తన 18వ ఏట ‘మంగళ నాయగి’ అనే తమిళ్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. 80వ దశకంలో తన గ్లామర్‌తో సిల్వర్ స్క్రీన్‌ను మరింత బ్యూటిఫుల్‌గా మార్చేసింది.
1980లలో నిషా నూర్ తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అగ్రహీరోలైన రజినీ కాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, రాజేంద్ర ప్రసాద్, భాను చందర్ వంటి స్టార్స్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కమల్‌తో టిక్ టిక్ టిక్, రజినీతో శ్రీ రాఘవేంద్ర, మోహన్ లాల్‌తో దేవాసురం, రాజేంద్ర ప్రసాద్‌తో ఇనిమై ఇదో ఇదో అనే తమిళ సినిమాల్లో నటించింది. తన అందం, నటనతో ఆకట్టుకుంది. 1980 నుంచి 1995 వరకు ఏదో ఒక పరిశ్రమ నుంచి అవకాశం వస్తూనే ఉంది. దీంతో కెరీర్ సాఫీగా సాగిపోయింది. అయితే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ స్టార్‌డమ్ నెమ్మదిగా కరిగిపోయింది. 1995 తర్వాత నిషా నూర్ కు ఒక్కటంటే ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ హీరోయిన్ అవకాశాలు రాకపోవడంతో తల్లడిల్లిపోయింది. అప్పటికే ఆమె సంపాదించిందంతా కరిగిపోయింది.
ఇక బతకడానికి ఏదో ఒక పని చేయాలిగా..! అందుకే ఆమె ఒక మార్గాన్ని ఎంచుకుంది. కాకపోతే అది తప్పుడు మార్గం. అదే నిషా జీవితాన్ని నాశనం చేసింది. ఒక నిర్మాత బలవంతం వల్ల, తప్పనిసరి పరిస్థితుల్లో సంపాదన కోసం నిషా నూర్ వ్యభిచారంలోకి దిగాల్సి వచ్చింది. వ్యభిచారం వల్ల కొంతకాలం ఆమె జీవితం సాగింది. అయితే, ఎంతోకాలం ఇది సాగదు కదా. వయసు పైబడటం, ఇతర కారణాల వల్ల కొన్నేళ్ల తర్వాత ఆమెకు ఈ దారి కూడా మూసుకుపోయింది. దీంతో మళ్లీ ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఆపై హెచ్ఐవీ సోకడంతో ఆమెను దగ్గరకు తీసేవాళ్లే కరువయ్యారు. అలా ఒంటరైన అందాల బొమ్మ.. అస్తి పంజరంగా మారి అత్యంత దీన స్థితిలో అనాథగా కన్నుమూసింది.