న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్ డైరెక్టర్ .. ఆ ఉద్దేశంతోనేనట !

by Anjali |
న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్ డైరెక్టర్ .. ఆ ఉద్దేశంతోనేనట !
X

దిశ, సినిమా: తమిళ్ ఇండస్ర్టీ‌లో అతి తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్‌గా ఎదగిన వారిలో లోకేశ్ కనగరాజ్ ఒకరు. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’, ‘లియో’ వంటి గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలను ఎంతో అద్భుతంగా రూపొందించి.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రజెంట్ రజనీకాంత్‌ 171వ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. కాగా ఈ సినిమాకు లోకేశ్ దాదాపు రూ.60 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకోబోతున్నాడని సమాచారం. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే తాజాగా లోకేశ్ కనగరాజ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏంటంటే.. లోకేశ్ కనగరాజ్ సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ‘G Squd’ పేరు‌తో సినిమాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ‘మరిన్ని మంచి కథలతో పాటు వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రొడక్షన్ వెంచర్ మొదలు పెట్టాను’ అంటూ చెప్పుకొచ్చాడు లోకేశ్.


Next Story