- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు నెలల్లో శ్రీముఖికి పెళ్లి.. బిడ్డను కూడా ఎత్తుకుని ఆ షోకి రానుందా?
దిశ, సినిమా: శ్రీముఖి యాంకర్‌గా పటాస్ షో ద్వారా పరిచయం అయి తన మాట తీరుతో అందరినీ కట్టిపడేసింది. ఆ తర్వాత వరుసగా పలు షోలు చేసి స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా శ్రీముఖి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం స్టార్ మా పరివార్, సూపర్ సింగర్, పండుగ స్పెషల్ షోస్ చేస్తూ బుల్లితెరపై యాంకర్‌గా కొనసాగుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ తన ఫొటోలు షేర్ చేసి ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. అయితే నిత్యం శ్రీముఖి పెళ్లి వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ ఆమె స్పందించకుండా బిజీ బిజీ లైఫ్ గడుపుతుంది. అయితే ఉగాది సందర్భంగా స్టార్ మాలో ప్రసారమైన మా ఇంటి పండగ షోలో శ్రీముఖి పెళ్లి ఆరు నెలల్లో చేస్తానని గంగవ్వ చెప్పింది. ప్రస్తుతం ఇదే విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
అసలు విషయంలోకి వెళితే.. మా ఇంటి ఉగాది పండుగ షోలో బుల్లితెర నటీనటులు తమ కుటుంబ సభ్యులను తీసుకుని వచ్చి సందడి చేశారు. అలాగే ఇందులో సేవ్ ది టైగర్ వెబ్ సిరీస్ లో చేసిన గంగవ్వ, జోర్దార్ సుజాత కూడా వచ్చారు. అయితే సుజాతతో పెళ్లి గంగవ్వ వాళ్ల ఊరికి వెళ్లి వచ్చాకే జరిగిందని ఆమె భర్త రాకేష్ చెప్పాడు. దీంతో వెంటనే శ్రీముఖి అందరికీ నువ్వే పెళ్లి చేస్తున్నావు అంట. మరి నాకు చేయాలనిపించలేదా అని ఫన్నీగా అడుగుతుంది.
దీంతో గంగవ్వ ‘‘ఆరు నెలల్లో నీ పెళ్లి కూడా చేస్తాను. వచ్చే ఉగాదికి నువ్వు ఓ బిడ్డను ఎత్తుకుని మళ్లీ ఈ షోకు వస్తావు’’ అని అంటుంది. దీంతో అంతా నవ్వేస్తారు. ఆ తర్వాత గంగవ్వకు అందరు కలిసి సన్మానం చేసి షాల్వా కప్పుతారు. దీంతో ఆమె ఎమోషనల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ షోలో శ్రీముఖి పెళ్లి గురించి గంగవ్వ చేసిన కామెంట్స్ హైలెట్‌గా నిలిచి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇవన్నీ నిజం కాదు షోలో భాగంగా అన్నప్పటికీ కొందరు నెటిజన్లు నిజమే కావొచ్చని రకరకాలుగా చర్చించుకుంటున్నారు.