Sreemukhi :బుల్లి తెర హీరో మనసులో శ్రీముఖి..బయటపడ్డ అసలు నిజం (వీడియో)

by Prasanna |   ( Updated:2023-08-17 06:55:53.0  )
Sreemukhi :బుల్లి తెర హీరో మనసులో శ్రీముఖి..బయటపడ్డ అసలు నిజం (వీడియో)
X

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి తన చిలిపి మాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడి చేతిలో చాలా షోస్ ఉన్నాయి. ఇందులో భాగంగా తాను యాంకరింగ్ చేస్తున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ‘గుప్పెడంత మనసు’ సీరియల్ హీరో హీరోయిన్‌తో పాటు పలు సీరియల్స్‌లోని హీరో హీరోయిన్స్ కూడా వచ్చి బాగా సందడి చేశారు. అయితే శ్రీముఖి ‘గుప్పెడంత మనసు’ హీరో ముఖేష్‌ను ఉద్దేశించి ‘ఈ సెట్‌లో నేను అలిగాను బుంగమూతి పెట్టుకున్నాను’ అంటూ క్యూట్‌గా హావభావాలు పలికించింది. దీంతో ముఖేష్ శ్రీముఖితో ‘నా మనసులో మొత్తం మీరే ఉన్నారు వసుధార.. అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు అలా ఉంటుంది’ అని అనడంతో వెంటనే శ్రీముఖి సిగ్గుపడింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

Read More: బొద్దింక, సీతాకోక చిలుక కథ చెప్పిన సమంత!

Advertisement

Next Story