మృణాల్ అందానికి యంగ్ హీరోయిన్ ఫిదా.. మనసును దోచేస్తున్నావంటూ కామెంట్

by sudharani |
మృణాల్ అందానికి యంగ్ హీరోయిన్ ఫిదా.. మనసును దోచేస్తున్నావంటూ కామెంట్
X

దిశ, సినిమా: ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్.. మొదటి మూవీతోనే మంచి హిట్ అందుకుని ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలో తన నటన, అందం, కట్టు బొట్టుతో కుర్రాళ్ల కళల రాణిగా మారిపోయింది. దీంతో ఈ అమ్ముడుకి వరుస ఆఫర్లు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ మూవీలో నటించింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తర్వాత విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’లో నటించింది. ఈ చిత్రం కూడా పర్వలేదు అనిపించుకుంది. ఇక ఇటీవల వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి’లో కనిపించి మెప్పించింది.

ప్రజెంట్ ఈ బ్యూటీ.. సినిమా సెలక్షన్ల విషయంలో ఆచి, తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం హిందీలో రెండు, మూడు మూవీస్ చేస్తున్నప్పటికీ తెలుగులో మాత్రం సినిమా అనౌన్స్ చెయ్యలేదు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు.. తన అందాలతో కుర్రాళ్లకు ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది మృణాల్. ఇందులో మృణాల్ అందాలకు ఫిదా అయినా యంగ్ బ్యూటీ శ్రీలీల ‘హార్ట్ త్రోబ్’ అంటే మనసు దోచే అందం అనే అర్థం వచ్చేలా కామెంట్ చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed