- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోంగార్డు నన్ను పచ్చి బూతుమాట అన్నాడు.. సౌమ్య జాను!
దిశ, సినిమా: కుర్ర నటి సౌమ్య జాను పలు టాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న సౌమ్య చందమామ, కథలు, తడాఖా, లయన్, వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఈ బ్యూటీ రీసెంట్‌గా బంజారా హిల్స్‌లో ట్రాఫిట్ హోమ్‌గార్డ్ పై దాడి చేసిన విషయం తెలిసిందే.
జాగ్వార్ కారు నడుపుతూ రాంగ్ రూట్‌లో ప్రయాణించిన ఈ నటిని బంజారా హిల్స్ ట్రాఫిక్ హోమ్ గార్డు అడ్డుకున్నారు. ఆమెను హోమ్ గార్డు అడ్డుకున్నందుకు వారిపై దాడికి పాల్పడింది. ఈ ఇష్యూపై పోలీసులు సౌమ్యపై కేసు కూడా నమోదు చేసారు. ఈ అమ్మడు రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు హాజరై అర్జెంట్ పని ఉన్నప్పుడు రాంగ్ రూట్‌లో వెళ్తే తప్పు ఏంటి? నాలాంటి పెద్ద సెలెబ్రిటీనే అడ్డుకుంటున్నారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? హోం గార్డు పై నేను కేసు కూడా పెడతానంటూ అసహనం వ్యక్తం చేసింది.
తాజాగా ఈ అమ్మడు నేను ఎక్కడికి పారిపోలేదంటూ యూట్యూబ్‌లో ప్రత్యక్షం అయ్యింది. సౌమ్యను హోంగార్డ్ పచ్చి బూతు మాట అన్నాడని తెలిపింది. ఒక అమ్మాయిని అలా ఎలా తిడతారని ఆరోపించింది. ఈ ఇష్యు తర్వాత తన ఫ్యామిలీ నరకం అనుభవిస్తోందని, రాంగ్ రూట్ లో వెళ్లడం నా తప్పే. అంతమాత్రాన ఒక అమ్మాయిని పట్టుకుని అలా అనడం అసలు కరెక్ట్ కాదు.
మా అమ్మకు అర్జెంట్ గా మెడిసిన్ తీసుకెళ్లాలని చెప్పినా వారు వినలేదు. దీంతో నాకు కోపం వచ్చింది. నేను ఎలాంటి హంగామా చేయలేదు. కావాలంటే సీసీ ఫుటేజ్ చెక్ చేయండి. మద్యం కూడా సేవించలేదు. కానీ హోంగార్డ్ చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశాడు. ఒక అమ్మాయిని ప్రతి మగాడు ఆ బూతు మాట ఎందుకు అంటాడో అస్సలు అర్థం కావడం లేదంటూ సౌమ్య జాను చెప్పుకొచ్చింది.