- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుట్టినింట్లో లింగ వివక్ష.. కన్న తల్లే కారణమంటున్న Sonam Bajwa
దిశ, సినిమా:పుట్టిన ఇంట్లోనే మహిళలు లింగవివక్షను ఎదుర్కొవడంపై సోనమ్ బజ్వా ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె నటించిన పంజాబీ ఫిల్మ్ ‘‘Godday Godday Chaa’ మే 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న నటి రీసెంట్ సమావేశంలో పెళ్లికిముందు పుట్టినింట్లో స్త్రీలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి మాట్లాడింది. ‘నేను ఇతర స్త్రీల మాదిరిగానే ఇంట్లో సెక్సిజాన్ని ఎదుర్కొన్నా. ఒకవైపు నా సోదరుడు స్వేచ్ఛగా ఆడుకుంటుంటే.. నేను మాత్రం వంటగదిగే పరిమితమయ్యాను. నా తల్లి నాతో బలవంతం ఇంటిపని చేయించేది. మన సమాజంలో కుమారులు రాత్రిపూట బయటికి వెళ్లవచ్చు. స్త్రీలు పగలు కూడా వెళ్లడానికి అనుమతించరు. ఎందుకని అడిగితే అబ్బాయిల కంటే ఆడపిల్లను ఎక్కువగా రక్షించుకుంటున్నట్లు చెబుతారు. ఈ అసమానత మన సమాజంలో లోతుగా పాతుకుపోవడం బాధకరం. నేను చిన్నప్పుడు ఈ విషయాలను ఎదుర్కొన్నప్పుడు నిజంగా బాధపడ్డాను’ అని చెప్పింది.
Read More: పెళ్లి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది శోభనమే.. నటి హాట్ కామెంట్స్ వైరల్