అల్లు అర్జున్ తీసుకున్న కట్నంపై క్లారిటీ ఇచ్చిన స్నేహ రెడ్డి తండ్రి?

by samatah |   ( Updated:2023-06-29 06:11:28.0  )
అల్లు అర్జున్ తీసుకున్న కట్నంపై క్లారిటీ ఇచ్చిన స్నేహ రెడ్డి తండ్రి?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన యాక్టింగ్, అదిరిపోయే స్టెప్పులతో ఎంతో మంది ప్రేక్షకులను కూడగట్టుకున్నాడు. ఇక బన్నీ, మూవీస్‌కు ఎంత ప్రియారిటీ ఇస్తారో, ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు.

తన పిల్లలు, భార్యతో కలిసి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపుతాడు. కాగా తాజాగా అల్లు అర్జున్‌పై అతని మామయయగారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బన్నీ, స్నేహ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.స్నేహను చేసుకోవడానికి అల్లు అర్జున్ వాళ్ల ఫ్యామిలీ ఒప్పుకున్నా, స్నేహ ఫ్యామిలీ ఒప్పుకోలేదంట. సినిమా వాళ్లు వేరే హీరోయిన్స్‌తో ఎఫైర్స్ ఉంటాయి, ఎక్కువగా ఫ్యామిలీని పట్టించుకోరు అని చెప్పుకొచ్చాడంట. కానీ స్నేహలత బయట కూడా అలానే ఉంటారు అని వారించడంతో.. పెళ్లి కి ఒప్పుకున్నారంట.

పెళ్లి సమయంలో అల్లు అర్జున్ ఒక్కరూపాయి కూడా కట్నం తీసుకోలేదంట. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ చాలా మంచి వాడు. మంచి యాక్టర్. అతను వివాహ సమయంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, నేను ఇచ్చే కట్నం కూడా వారికి సరితూగదు. ఆయన మా ఇంటికి అల్లుడు కావడం నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.

Also Read: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి.. పోస్ట్‌తో క్లారిటీ

Advertisement

Next Story