Sidhu Jonnalagadda : ఫుల్ జోష్‌లో సిద్ధు జొన్నలగడ్డ.. కానీ కొంచెం క్రాక్

by sudharani |   ( Updated:2024-09-06 16:00:17.0  )
Sidhu Jonnalagadda : ఫుల్ జోష్‌లో సిద్ధు జొన్నలగడ్డ.. కానీ కొంచెం క్రాక్
X

దిశ, సినిమా: ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్వ్కేర్’ చిత్రాల బ్లాక్ బస్టర్ హిట్‌తో ఫుల్ జోష్ మీద ఉన్న సిద్ధు జొన్నలగడ్డ.. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శక‌త్వంలో సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘కొంచెం క్రాక్’ అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ మూవీ ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే విధంగా రూపొందుతోంది. శ్రీవెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బివిఎస్ఎన్‌.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. హైద‌రాబాద్‌లో జ‌రుగుతోన్న షెడ్యూల్‌లో ప్రకాష్‌రాజ్‌, న‌రేష్‌, బ్రహ్మాజీ త‌దిత‌రుల‌తో హిలేరియ‌స్ కామెడీ స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్నారు. వీరితో పాటు సిద్ధు తిరుగులేని కామెడీ టైమింగ్ ప్రేక్షకుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందించ‌నుంది. ఇక ఇప్పటివ‌ర‌కు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. నెక్ట్స్ షెడ్యూల్ నేపాల్‌లో షూట్ చెయ్యడానికి స‌న్నాహాలు చేస్తున్నారట మేకర్స్. అంతేకాకుండా ఈ కొత్త షెడ్యూల్‌ను సెప్టెంబ‌ర్ 15 నుంచి ప్రారంభించ‌నున్నారు. కాగా.. ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవి చైత‌న్య ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. తదితర వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed