సిద్ధార్థ్ ‘టక్కర్’ నుంచి బిగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్

by Harish |   ( Updated:2023-05-19 12:00:44.0  )
సిద్ధార్థ్ ‘టక్కర్’ నుంచి బిగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్
X

దిశ, సినిమా: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, కార్తీక్ జి. క్రిష్ కాంబోలో వస్తున్న ‘టక్కర్’ నుంచి బిగ్ అప్‌డేట్ వెలువడింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రాన్ని జూన్ 9న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఇటీవలే విడుదలైన రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో కూడిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇందులో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోగా ఈ సినిమాతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ అభిమానులను ఆకట్టుకుని ఘన విజయం సాధించి, సిద్ధార్థ్ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.

Read more:

‘నువ్వేం చెప్పావో నాకు బాగా అర్థమైంది’.. ఐశ్వర్య కామెంట్స్‌పై రష్మిక

Advertisement

Next Story