- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ కారణంతోనే 'వాల్తేరు వీరయ్య' ఈవెంట్‌కు రాలేదు: Shruti Haasan

దిశ, సినిమా: మానసిక సమస్యల కారణంగా 'వాల్తేరు వీరయ్య' ఈవెంట్‌కు హాజరుకాలేదన్న వార్తలను శృతిహాసన్ కొట్టిపారేసింది. తాను ఎలాంటి మెంటల్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడలేదని, కేవలం వైరల్ ఫీవర్‌తోనే కార్యక్రమానికి దూరంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తన హెల్త్ ఇష్యూపై వచ్చిన ఫేక్ న్యూస్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. 'ఇలాంటి తప్పుడు సమాచారం నా విషయంలో పనిచేయదు. ఎందుకంటే నాకు నేను ఎల్లప్పుడూ మానసిక ఆరోగ్య న్యాయవాదిగా ఉంటాను. అన్ని అంశాల్లో నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రోత్సహించుకుంటాను. నాకు వైరల్ ఫీవర్ మాత్రమే ఉంది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నా. ఒకవేళ మీకు మానసిక సమస్యలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు' అని స్పష్టం చేసింది. అలాగే తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన అభిమానులకు థాంక్యూ చెప్పింది.