‘బాంబ్’ సినిమాతో వచ్చేస్తున్న శివాత్మిక.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

by sudharani |   ( Updated:2024-09-06 16:12:25.0  )
‘బాంబ్’ సినిమాతో వచ్చేస్తున్న శివాత్మిక.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: సీనియర్ హీరో రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. ‘దొరసాని’ మూవీలో నటించిన ఈమె.. మొదటి చిత్రంతోనే ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్‌గా సైమా అవార్డ్ అందుకుంది. ఇక తర్వాత ‘పంచతంత్రం, ఆకాశం, రంగమార్తండ, విధి విలాసం, ఆనందం విలైయూడుం వీడు (తమిళ్)’ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. కాస్త గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది.

అనేక సినిమాల్లో విలన్‌గా అదరగొట్టిన నటుడు అర్జున్ దాస్.. ఇప్పుడు హీరోగా బిజీ అయిపోయాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రానికి ‘బాంబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జీవిత వినోదాన్ని వివరించే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశాల్ వెంకట్ దర్శకత్వం వహిస్తున్నాడు. శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జెంబ్రియో పిక్చర్స్ బ్యానర్‌పై సుధా సుకుమార్, సుకుమార్ బాకృష్ణన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో చుట్టూ చాలా మంది ప్రజలు ఉండగా.. మధ్యలో ఒకతను మెడలో దండలతో కూర్చిలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉండగా.. అతడి వెనుక శివాత్మిక ఓ పల్లెటూరి అమాయకపు అమ్మాయిలా కనిపిస్తుంది. కాగా.. ఈ మూవీలో కాళి వెంకట్, నాజర్, అభిరామి, సింగం పులి, బాల శరవణన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed